ADS

header ads

వేధింపులనుండి కాపాడండి : జడ్పిటిసి

 


తిరుపతి జిల్లా చిల్లకూరు మండలం ముత్యాలపాడు పంచాయతీ పెజ్జాయి ప్రవీణ్ రెడ్డి నుంచి తనను కాపాడాలని, ఆయన వేధింపులను తట్టుకోలేకపోతున్నానని చిల్లకూరు జడ్పిటిసి మన్నెం శీనయ్య  ఆవేదన వ్యక్తం చేశారు. ఈరోజు గూడూరు పట్టణంలోని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ,  ఎంపీపీ నిధులను ఖర్చు చేయడానికి జడ్పిటిసి సభ్యునికి అధికారం ఉందాఅని,ఎంపీపీ పూర్తి సహాయ సహకారాలతోనే జడ్పిటిసి శీనయ్యకు పనులు కేటాయించారని,నేను చేసిన పనులన్నిటికీ మెజర్మెంట్ బుక్కులు ఉన్నాయన్నారు.ఈ దేశంలోఎక్కడైనా దళితులు అగ్ర వర్ణాల  వారిపై దాడులు చేసినట్లు నిరూపించగలరా.ఎక్కడైనా దళితులు మనోవ్యధకు  గురైనట్లు చూస్తున్నాం కానీ, అగ్రవర్ణాల వాళ్లు మనోవేదనకు గురైనట్లు కొత్తగా వింటున్నాంఅన్నారు.నన్ను నా కులాన్ని అవమానించారు అని చెబుతుంటే, నేను చేసిన పనులలో అవినీతి ఉందనడం ఎంతవరకు న్యాయం.ఒక దళిత జడ్పిటిసి కి అవమానం జరిగితే దళిత నాయకులు కుల సంఘాలు ప్రజా సంఘాలు స్పందించరా.ఒకవేళ నేను చేసిన పనులలో అవినీతి జరిగి ఉంటే దానికి పూర్తి బాధ్యత వహిస్తాను.నేను చిల్లకూరు జడ్పిటిసి ని, వైఎస్ఆర్సిపి నాయకుడిని, అసలు ప్రవీణ్ రెడ్డికి కనీసం ఏ పదవి లేదు.

నేను చేసిన పనులన్నిటికీ పూర్తి వివరాలతో బహిరంగ చర్చకు వస్తాను అని చిల్లకూరు జడ్పిటిసి మన్నెంశీనయ్య తెలియజేసారు.తిరుపతి జిల్లా అట్రాసిటీ కమిటీ మెంబెర్ నన్నూరువెంకటరమణయ్య మాట్లాడుతూ, చిల్లకూరు జడ్పిటిసి మన్యం సీనయ్య ఎస్సీ మాలకులానికి చెందిన వ్యక్తి అని, అతనిని ప్రవీణ్ రెడ్డి చాలా కాలం నుండి వేధింపులకు గురి చేస్తున్నట్లు తెలియడంతో, సంబంధిత అధికారులు విచారణ చేసిప్రవీణ్ రెడ్డి పై ఎస్సి ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలనీ తెలిపారు. దళితుల మీదఇటువంటి దాడులకు పాల్పడితే సహించబోము అన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు ప్రభాకర్, వైసిపి తిరుపతి పార్లమెంటరీ  నాయకులు కొట్టు అశోక్పాల్గొన్నారు.

Post a Comment

0 Comments